ఏలూరు కార్పొరేషన్ వైకాపా వశం
50 డివిజన్లకు గాను, 47 డివిజన్లలో విజయకేతనం

Eluru: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైకాపా స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు గాను, , 47 డివిజన్లు వైకాపా సొంతం అయ్యాయి. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయ గంట మోగించింది. కాగా జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/