ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

బ్రిటన్‌లో విషాద ఛాయలు

Elizabeth's husband, Prince Philip, died
Elizabeth’s husband, Prince Philip, died

London: బ్రిటన్ ‌ రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) తుది శ్వాస విడిచారు. శుక్రవారం తెల్లవారుఝామున ఆయన .రాచభవనం విండ్సర్‌ కేసిల్‌లో మృతిచెందినట్టు రాజప్రాసాదం ప్రకటన జారీ చేసింది. ఆ తరుణంలో ఆయన చెంతనే రాణి ఉన్నారు. తనకు భర్తే కొండంత అండ అని , ఇన్ని దశాబ్దాలపాటు సజావుగా రాజరికపు బాధ్యతలు తాను నిర్వర్తించగలగడానికి ఆయనే కారణమని, ఆయన రుణం తీర్చుకోలేననీ గతంలో ఎలిజెబెత్‌ పేర్కొన్న విషయం విదితమే. వీరిద్దరూ బయటకు ఎప్పుడు వచ్చినా కలిసే వచ్చేవారు. ‌ ఫిలిప్ మరణంతో బ్రిటన్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. బ్రిటన్‌ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం జీవించిన రాజప్రముఖుడు ఫిలిప్ కావడం విశేషం. . ప్రిన్స్‌ చార్లెస్‌ (72), ప్రిన్సెస్‌ ఏనీ (70), ప్రిన్స్‌ ఏండ్రూ (61), ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ (57) వీరి సంతానం.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/