చిత్తూరు రూరల్‌లో ఏనుగు మృతి


చిత్తూరు: ఏపిలోని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు అనుమానాస్పద స్థితిలో మరణించింది. పలమనేరు రూరల్‌ మండలంలోని గంగంసిరుసు వద్ద ఏనుగు మృతి చెందినట్లు ఐదు రోజుల క్రితం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఐనప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో అటవీ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడ, మగ ఏనుగు కొట్లాడుకును ఉంటాయని, ఆ కొట్లాటలో ఆడ ఏనుగు, మగ ఏనుగును చంపి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. మొత్తానికి ఏనుగు మృతి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos