రేవంత్‌పై విద్యుత్ ఉద్యోగుల ఆగ్రహం

electricity-employees
electricity-employees

హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావుపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ ముందు ధర్నా చేసిన ఉద్యోగులు, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ నుంచి గన్‌పార్కుకు ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మింట్ కాంపౌండ్ వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. 70 వేల మంది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 6 గంటల కరెంటు ఇవ్వని సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు 24 గంటల కరెంటు వెనుక ఉద్యోగుల కష్టానికి మించి ప్రభాకరరావు కష్టం ఉందని, ఆయన్ను అవమానిస్తే మొత్తం కరెంటు లోకాన్నే అవమానించినట్లేనని మండిపడ్డారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/