తీవ్రతరమవుతున్న ఆర్టీసీ సమ్మె

మద్దతు ప్రకటించిన టీటీయూలోని 21 విద్యుత్ సంఘాలు

TSRTC Strike
TSRTC Strike

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంతకంతకూ తీవ్రతరమవుతోంది. వివిధ శాఖలకు సంబంధించిన పలు సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా, తెలంగాణ ట్రేడ్ యూనియన్ లో ఉన్న 21 విద్యుత్ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. వారితో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. మరోవైపు, ప్రభుత్వానికిఆర్టీసీ కార్మికులకు మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానని టీఆర్ఎస్ ఎంపీ కేకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో వేచి చూడాలి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/