బెంగాల్‌ కన్నా కాశ్మీర్‌లోనే ఎన్నికలు ప్రశాంతం

narendra modi
narendra modi

హైదరాబాద్‌: కోల్‌కతాలో అమిత్‌ షా రోడ్డు షోలో జరిగిన హింస గురించి ప్రధాని నరేంద్ర మోది ప్రస్తావించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..బెంగాల్‌ కన్నా కాశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనిమోది అన్నారు. వ్యక్తిగత ద్వేషం వలన దేశానికి నష్టం జరుగుతుందని, కాశ్మీర్‌లోని పంచాయితీ ఎన్నికల వేళ ఒక పోలింగ్‌ బూత్‌లో కూడా హింస జరగలేదని, కానీ బెంగాల్‌లో మాత్రం పంచాయితీ ఎన్నికల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కొందరు దాడులకు భయపడి జార్ఖండ్‌కు పారిపోయినట్లు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/