పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బంది

election-poll-officers
election-poll-officers

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు గాను అధికారులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 2,97,08,599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 34,604 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి 2.80 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు మూడు హెలికాప్టర్లను కూడా ఉపయోగించనున్నారు. అలాగే అటవీ ప్రాంతాల్లో విధుల్లోఉన్న సిబ్బందికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించడం కోసం ఎయిర్ అంబులెన్స్‌లను అందుబాటులో పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/