ఫిబ్రవరి 10 తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ..

ఎస్ఇసీ పార్థసారథి

TS Election Commissioner Parthasarathy
TS Election Commissioner Parthasarathy

Hyderabad: గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ కొత్త మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 10వ తేది  తరువాత ఎప్పుడైనా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్ధ‌సార‌థి ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఉన్న న‌గ‌ర పాల‌క క‌మిటీ ప‌ద‌వీ కాలం ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఉన్న విష‌యాన్ని ఆయ‌న  ఈ’ సందర్గుభంగా ర్తు చేశారు. ముందుగా జ‌న‌వ‌రి 10 – 15వ తేదిల మ‌ధ్య‌లో కార్పొరేట‌ర్లు గా గెలిచిన అభ్య‌ర్దుల వివ‌రాల‌తో గెజిట్ విడుద‌ల చేస్తామ‌న్నారు.

ఆ త‌ర్వాత 30 రోజుల‌లో మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లు ఒకే రోజున నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  ఈ లోగా గెలిచిన కార్పొరేట‌ర్లు అంద‌రూ త‌మ ఎన్నిక‌ల ఖ‌ర్చుల వివరాలు త‌మ‌కు అందించాల‌ని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/