జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్‌

ZPTC, MPTC elections 2019
ZPTC, MPTC elections 2019


హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుంది. ఎంపిటిసి, జడ్పీటిసి స్థానాలకు ఎన్నికలు ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. వచ్చేనెల 14వ తేది లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ ఓట్ల లెక్కింపు చేపడతారు.
త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపిటిసి, జడ్పీటిసి స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ఎన్నికలు జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపిటిసి స్థానాలు, 535 జడ్పీటిసి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మొదటి దశ పోలింగ్‌ తేది: 06.05.2019
రెండవ దశ పోలింగ్‌ తేది: 10.05.2019
మూడవ దశ పోలింగ్‌ తేది: 14.05.2019

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/