దేవేందర్‌గౌడ్‌ను కలిసిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత, మాల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి టిడిపి సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు తెలిపారు.పెద్దల నుంచి మద్దతు తీసుకుంటే టిఆర్‌ఎస్‌ను ఓడించడం సునాయాసం అవుతుందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్, తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కలిశానని చెప్పారు. ఇప్పుడు దేవేందర్‌ గౌడ్‌ను కలిశానని పేర్కొన్నారు. తాను కలిసిన వారంతా సానుకూలంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖులందరినీ కలుపుకొని ప్రచారంలో ముందుకెళ్తానని రేవంత్‌ చెప్పారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/