తెలంగాణలో టిఆర్‌ఎస్‌ 8 ఎంపి స్ధానాలు కైవసం!

TRS
TRS

హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాలకు ఎంపి అభ్యర్దులు గెలుపొందారు. 17 స్థానాలకు గాను 12 స్థానాల అభ్యర్ధుల వివరాలు సాయంత్రం 4.30 గంటలకు తెలిసినవి. ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ స్థానానికి టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాలోతు కవిత, జహీరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి బి బి పాటిల్‌, వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది పసునూరి దయాకర్‌, పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి వెంకటేశ్‌ నేత, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మన్నె శ్రీనివాసరెడ్డి, మెదక్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి రాములు విజయం సాధించారు.
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి రేవంత్‌రెడ్డి, భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్‌లో బిజెపి అభ్యర్థి బండి సంజ§్‌ు, ఆదిలాబాద్‌లో బిజెపి అభ్యర్ధి సోయం బాపురావు గెలుపొందారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/