కాళేశ్వరానికి జాతీయ హోదా, నిధులు!

వినోద్‌ను గెలిపిస్తే కరీంనగర్‌కు రైలు
ముస్తాబాద్‌ బహిరంగ సభలో కేటిఆర్‌

eatala rajender, KTR
eatala rajender, KTR


హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేటిఆర్‌ మాట్లాడుతూ..16 సీట్లకు 16 సీట్లు గెలిస్తే హస్తినాపురంలో మనదే పైచేయిగా ఉంటుందని, ఇద్దరు ఎంపీలతోనే కేసిఆర్‌ తెలంగాణ తెచ్చారు. ఇప్పుడు 16 సీట్లు గెలిస్తే ఇంకెంత చేస్తారో ఆలోచించాలి. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు రావాలంటే ఎంపీలు ఢిల్లీ మెడలు వంచే పరిస్థితి ఉండాలని అన్నారు. కరీంనగర్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్ధి వినోద్‌ కుమార్‌ను గెలిపిస్తే..రెండేళ్లలో కరీంనగర్‌కు రైలు వచ్చి తీరుతుంది. అలాగే కాళేశ్వరం పూర్తయితే కాలువలన్నీ నీళ్లతో కళకళలాడుతాయి. రూ. 80 వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. నీతి ఆయోగ్‌ తెలంగాణకు నిధులివ్వాలని చెప్పినా మోది ఇవ్వలేదు. ఎన్డీఏలో భాగంగా ఉన్న రాష్ట్రాలకే మోది నిధులు ఇస్తున్నారు. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలకు వాళ్ల అధిష్టానంపై పోరాడే ధైర్యం లేదని కేటిఆర్‌ విమర్శించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/