‘మోది ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలిపారు’

d k aruna
d k aruna

మహబూబ్‌నగర్‌: పాలమూరులో పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంతం అభివృద్ధికి అమర్నిశలు తాపత్రయ పడ్డానని బిజెపి నేత, మాజీ మంత్రి డికే అరుణ అన్నారు. కేసిఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉండాలని ఆమె అన్నారు. శుక్రవారం పాలమూరు వేదికగా ప్రధాని మోది దక్షిణ భారత ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ అమిస్తాన్‌పూర్‌లోని భూత్పూర్‌ ఐటిఐ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ..ప్రపంచంలోనే మోది ఓ బలమైన నాయకుడని, ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. పాలమూరు ఎంపి స్థానాన్ని గెలిపించి మోదికి కానుకగా ఇవ్వాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/