విదిషా ఎంపి స్థానం నుంచి మోది పోటీ!

vajpayee, modi
vajpayee, modi


న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పోటీ చేసి గెలిచిన విదిషా లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోది పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. మధ్యప్రదేశ్‌లోని విదిషా నియోజకవర్గం నుంచి మోది పోటీ చేయాలని ఆ రాష్ట్ర మంత్రి రాఘవ్‌ జీ భా§్‌ు ప్రధానిని కోరినట్లు తెలుస్తుంది. 1991లో లక్నోతో పాటు విదిషా నుంచి కూడా అటల్‌జీ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత విదిషా స్థానానికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. ఇదే స్థానం నుంచే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సుష్మాస్వరాజ్‌ గతంలో గెలుపొందారు. అందుకే విదిషా నుంచి మోది పోటీ చేస్తే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లో బిజెపి గెలుపు ఆశలు చిగురిస్తాయని రాఘవ్‌జీ నమ్మకం. ఇంకా భోపాల్‌, ఇండోర్‌, విదిషా స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు. దీంతో విదిషా నుంచి మోది పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos