ప్రకాశ్‌ అంబేద్కర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

prakash ambedkar
prakash ambedkar


యవత్మల్‌: ఎన్నికల వేళ డాక్టర్‌ అంబేద్కర్‌ మనవడు, భరిప బహుజన్‌ మహాసంగ్‌ ఛైర్మన్‌ ప్రకాశ్‌ అంబేద్కర్‌ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని రెండు రోజుల పాటు జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ బిజెపికి ఈసి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మహారాష్ట్రలోని యవత్మల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ..మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని వదిలేదని, రెండు రోజుల పాటు జైల్లో పెడతామని అన్నారు. ఈసి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వివాదాస్పదంగా మాట్లాడారు.

తాజా నటీ నటుల ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/