యుపి కూటమికి మరో మూడు పార్టీలు

akhilesh yadav
akhilesh yadav, Samajwadi Party president


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బిఎస్పీ కూటమిలో మరో మూడు పార్టీలు చేరుతున్నట్లు ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. నిషద్‌ పార్టీ, జన్‌వాడి పార్టీ, రాష్ట్రీయ సమతా దళ్‌ నాయకులు కూటమికి విజయానికి కృషి చేస్తారని తెలిపారు. అఖిలేష్‌ మంగళవారం నాడు ఆ మూడు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల్లో పట్టు ఉండడమే పొత్తుకు కారణంగా తెలుస్తుంది. ఎలాగైనా బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమికి ఈ మూడు పార్టీలు కొంత ఊరటనిచ్చాయి. అందుకే అఖిలేష్‌ ఈ పార్టీలతో పొత్తుకు అంగీకరించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/