గురుదాస్‌పూర్‌ నుంచి సన్నీడియోల్‌ నామినేషన్‌

Sunny Deol
Sunny Deol


న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్‌ యాక్షన్‌ నటుడు సన్నీడియోల్‌ నామినేషన్‌ వేశారు. కొద్ది రోజుల క్రితమే బిజెపిలో చేరిన ఆయన అదే పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేయడానికి ముందు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తమ్ముడు బాబీడియోల్‌ కూడా ఉన్నారు.
గురుదాస్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపి సునీల్‌ జాఖర్‌ పోటీలో ఉన్నారు. సునీల్‌తో సన్నీ గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. ఇక ఆప్‌ నుంచి పీటర్‌ మసయా బరిలో ఉన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/