కాన్వాయ్‌ను ఢీకొట్టిన సన్నీడియోల్‌ కారు

sunny deol
sunny deol

హైదరాబాద్‌: సన్నీడియోల్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మరో మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన సోహెల్‌నగర్‌లో ఇవాళ ఉదయం జరిగింది. ఫతేగర్‌ చురియన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆయన కారు కాన్వాయ్‌లో ఉన్న వాహనాలతో పాటు మరో కారును ఢీకొట్టింది. టైరు పేలడం వల్ల ఈ ఘటన జరిగింది. గురుదాస్‌పుర్‌ నుంచి బిజెపి అభ్యర్ధిగా సన్నీ డియోల్‌ పోటీపడుతున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/