అమేథిలో రాహుల్‌కు బిజెపి నుంచి గట్టిపోటీ

Smriti Irani
Smriti Irani

అమేథి: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై తన విజయం ఖాయమని కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధీమా వ్యక్తం చేశారు. అమేథిలో బిజెపి జెండా ఎగురుతుందని ఆమె చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె గురువారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయే యుద్దంలో పోరాడుతుందని, తన గెలుపు అమేథి ప్రజల గెలుపుగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్పీ-బిఎస్పీ సైతం రాహుల్‌కి మద్దతు తెలుపుతున్నప్పటికీ బిజెపి నుంచి గట్టిపోటీనిస్తున్నాము అని అన్నారు. అమేథిలో రాహుల్‌ గెలుపు సాధ్యం కాదని ఈ పని చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/