ఆమ్‌ ఆద్మీకి ఎస్పి, బిఎస్పిల మద్దతు..!

mayawati, kejriwal, akhileh yadav
mayawati, kejriwal, akhileh yadav

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటిచేస్తున్న ఎస్పి, బిఎస్పీ పార్టీలు ఢిల్లీలో కూడా తమ ఓటు బ్యాంకు చీలకుండా పథకం రచించాయి. ఢిల్లీలో రెండు చోట్ల సియం కేజ్రివాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. మిగతా స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టికి తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఎస్పి వెల్లడించింది.
న్యూఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ(రిజర్వ్‌డ్‌) స్థానాల్లో తాము ఆమ్‌ ఆద్మీకి మద్దతిస్తామని, అక్కడ బిఎస్పీ అభ్యర్ధులను పోటీలో ఉంచకూడదని బిఎస్పీ నిర్ణయించినందున ఆప్‌ గెలుపు కోసం పనిచేస్తామని ఎస్పి ఢిల్లీ విభాగం ప్రతినిధి ఆర్‌ఎస్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/