ఎన్నికల ప్రచారంలో కమల్‌కు చేదు అనుభవం

kamal haasan
kamal haasan

చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కమల్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా కొందరు ఆయనపైకి చెప్పులు విసిరారు. కమల్‌ బుధవారం నాడు మధురై అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుప్పరాన్‌కుంద్రమ్‌లో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. వాహనంపై నిల్చుని ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. అవి కమల్‌ వాహనానికి తగిలి కిందపడ్డాయి. ఈ ఘటనపై కమల్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 11మందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/