కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి శశిథరూర్‌ తలకు గాయం

shashi tharoor
shashi tharoor


తిరువనంతపురం: కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శశిథరూర్‌, ఇవాళ ఉదయం గాంధారి అమ్మన్‌ కోవిల్‌ ఆలయంలో తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జారిపడ్డారు. దీంతో శశిథరూర్‌ తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. కేరళలోని 20 ఎంపి స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos