కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ప్రియాంక చతుర్వేది

pyiyanka chaturvedi
pyiyanka chaturvedi,


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది గుడ్‌బై చెప్పారు. కొద్ది రోజుల క్రితం మధురలో ఆమె రాఫెల్‌ డీల్‌ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్‌ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె అధిష్టానానికి వారిపై ఫిర్యాదు చేయడంతో వారిని పార్టీ సస్పెండ్‌ చేసింది. ఐతే జ్యోతిరాధిత్య సింధియా జోక్యంతో వారిపై సస్పెండ్‌ ఎత్తివేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రియాంక ఆగ్రహానికి గురయ్యారు. తనను అవమానించిన వారికి కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో పార్టీలో పార్టీ కోసం శ్రమించే వారికి బదులు గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. పార్టీ నిర్లక్ష్య వైఖరికి సమాధానంగా ఆమె ఆ పార్టీని వీడారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/