పలుచోట్ల పోలింగ్‌ శాతం

polling
polling


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది.మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం సమయానికి పలుచోట్ల నమోదైన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే…ఉత్తరప్రదేశ్‌లో 50.39 శాతం, కర్ణాటకలో 49.25 శాతం, పశ్చిమ బెంగాల్‌లలో 60 శాతం, బీహార్‌లో 49.5 శాతం, అసోంలో 60.38 శాతం, ఛత్తీస్‌ఘడ్‌లో 59.25 శాతం, తమిళనాడులో 47.57 శాతం, మహారాష్ట్రలో 49.5 శాతం, మణిపూర్‌లో 68.75 శాతం, కశ్మీర్‌లో 38.5 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/