బెంగాల్‌లో నోడల్‌ అధికారి అదృశ్యం

arnab roy
arnab roy, nodal officer

డార్జిలింగ్‌: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ నోడల్‌ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవిఎంలు, వివిప్యాట్‌లకు ఇన్‌ఛార్జ్‌ ఐన అర్నబ్‌రా§్‌ు గురువారం మధ్యాహ్నాం నుంచి కనిపించడంలేదు, ఆయన గురువారం నాడు విధుల్లో భాగంగా విప్రదాస్‌ చౌదరి పాలిటెక్నిక్‌ కాలేజిలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రా§్‌ు తిరిగి రాలేదు. దీంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు అర్నబ్‌ కోసం గాలిస్తున్నారు. అతడి కారు డ్రైవర్‌ను విచారిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/