ఓటేసిన ప్రధాని మోది

narendra modi
narendra modi

అహ్మదాబాద్‌: ప్రధాని మోది తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్‌లోని నిశన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటు వేయటానికి ముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి చేరుకున్న మోది ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా ఉన్నారు. ఓటు వేసిన అనంతరం మోది మీడియాతో మాట్లాడుతూ..గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/