ఈ నెల 21న విపక్ష సమావేశానికి కీలక నేతల డుమ్మా!

akhilesh, mamata, mayawati
akhilesh, mamata, mayawati


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలో ఈ నెల 21న ఢిల్లీలో జరగనున్న విపక్షాల మహాకూటమి సమావేశానికి ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌ సియం, టిఎం అధినేత్రి మమతా బెనర్జీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబుకు చుక్కెదురైంది. గతవారం చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారు. ఐతే మమతానుంచి ఆశించిన స్పందన రాలేదని సమాచారం. ఈ నెల 23న ఫలితాల వెల్లడికి ముందు ఎలాంటి సమావేశం అవసరం లేదని దీదీ తేల్చిచెప్పినట్లు తెలిసింది. అఖిలేష్‌, మాయావతి నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చినట్లు సమాచారం.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/