బిజెపి, కాంగ్రెస్‌ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు

mk stalin
mk stalin


చెన్నై: దేశంలో ఈసారి పరిపాలన చేయడానికి కాంగ్రెస్‌, బిజెపియేతర కూటమికి ఎలాంటి అవకాశం లేదని డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. కాంగ్రెస్‌, బిజెపియేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సియం కేసిఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కేసిఆర్‌ నిన్న చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని, ఇందుకోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసిఆర్‌ కోరారు. ఐతే మరుసటి రోజే సమాఖ్య కూటమిపై స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్‌ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందని తనకు అన్పించడం లేదని అన్నారు. ఐతే మే 23 తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/