ఒడిశా సియంగా ఐదోసారి నవీన్‌ పట్నాయక్‌ ప్రమాణం

naveen patnaik
naveen patnaik

భువనేశ్వర్‌: బిజెడి అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌ చేత ఆ రాష్ట్ర గవర్నర్‌ గణేషి లాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది ఐదోసారి. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నవీన్‌ పట్నాయక్‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలు మంత్రలుగా ప్రమాణం చేశారు. ఈ సారి 10 మంది కొత్త వారికి చోటు లభించింది. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో బిజెడి 112 సీట్లు సాధించింది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/