దేశవ్యాప్తంగా ప్రముఖుల స్థానాలు

MODI, RAHUL
MODI, RAHUL

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరంభ ఫలితాల్లో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తొలుత ఆధిక్యంలో ఉండగా..ప్రస్తుతం వెనకబడిపోయారు. ప్రధాని మోది కూడా వారణాసిలో వెనుకంజలో ఉన్నారు. దిగ్విజ§్‌ు సింగ్‌, జ్యోతిరాధిత్య సింధియా, కన్నౌజ్‌లో డింపుల్‌ యాదవ్‌, తుముకూరులో దేవెగౌడ, పాటలిపుప్రతలో మీసా భారతి, విజయనగరంలో అశోక్‌గజపతి రాజు, ఈశాన్య ఢిల్లీలో షీలాదీక్షిత్‌, బెగూసరా§్‌ులో కన్నయ్యకుమార్‌, గుల్బర్గాలో మల్లికార్జున ఖర్గే రాంపూర్‌లో జయప్రద వెనుకంజలో ఉన్నారు.
రా§్‌ుబరేలిలో సోనియా, వయనాడ్‌లో రాహుల్‌, పాట్నాసాహిబ్‌లో రవిశంకర్‌ ప్రసాద్‌, నాగ్‌పూర్‌లో నితిన్‌ గడ్కారీ, మధురలో హేమమాలిని, ఉన్నావ్‌లో సాక్షి మహరాజ్‌, లక్నోలో రాజ్‌నాథ్‌ సింగ్‌, సుల్తాన్‌పూర్‌లో మేనకాగాంధీ, ఫిలిబిత్‌లో వరుణ్‌గాంధీ ,మాండ్యలో సుమలత, తూర్పు ఢిల్లీలో గౌతమ్‌ గంభీర్‌, గాంధీనగర్‌లో అమిత్‌షా మందంజలో ఉన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/