నిషేధంపై సుప్రీంకు మయావతి

mayawati
mayawati


హైదరాబాద్‌: బిఎస్పీ నేత మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం మాయావతిపై 48 గంటలు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే, ఐతే ఆ నిషేధాన్ని మాయావతి సుప్రీంకోర్టులో ఇవాళ సవాలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన యుపి సియం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి మేనకాగాంధీ, యుపినేత ఆజం ఖాన్‌పై కూడా ఈసి కొరడా ఝళిపించారు. ఇవాళ ఉదయం నుంచి ఈసి ఆదేశాలు అమలులోకి వస్తాయి. ఐతే మాయావతి అభ్యర్ధనను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించింది. బ్యాన్‌పై సపరేట్‌ పిటిఫన్‌ వేయమని సుప్రీం చెప్పింది. ఇప్పుడు ఇది విచారించలేం. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం పేర్కొన్నది. విద్వేష ప్రసంగాలు చేస్తున్న నేతలపై ఈసి తీసుకున్న చర్యలను సుప్రీం సమర్ధించింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని కోర్టు చెప్పింది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/