అమేథిలో రాహుల్‌పై స్నిపర్‌గన్‌ గురి

ఏడుసార్లు లేజర్‌కిరణాల ప్రసరణ
హోంమంత్రికి లేఖరాసిన కాంగ్రెస్‌ సీనియర్లు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సొంతనియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలుచేసిన తర్వాత మీడియాప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో ఏడుసార్లు లేజర్‌గన్‌ కిరణాలు రాహుల్‌వైపు వచ్చాయని, దీన్నిబట్టి ప్రతిపక్ష నాయకుడు, ఎఐసిసి అధ్యక్షునికి ప్రాణహాని ఉన్నట్లు అనుమానం కలుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ సినయర్‌ నాయకులు కేంద్ర హోంమంత్రికి లేఖరాసారు. ఒక ఆకుపచ్చ కిరణాలు ఏడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పడ్డాయని ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తుజరిపించి ప్రమాదాన్ని నివారించాలని అలాంటివేమైనా జరిగితే ప్రోటోకాల్‌పరంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన సెక్యూరిటీని మరింత కఠినతరం చేయాలనికోరారు. ఆకుపచచ్చరంగులోని లేజర్‌కిరణం కాంగ్రెస్‌ అద్యక్షునిపై ఏడుసార్లు ప్రసరింపచేసారని అందులోను నొసటిపై ఎక్కువసార్లు పడిందని ఎంతో అనుమానించదగిన అంశంగా కాంగ్రెస్‌ప్రకటించింది. ఒకటి, రెండుసార్లుకాదు ఏకంగా ఏడుసార్లు ఈ కిరణాలనునప్రసరింపచేసారని, లేజర్‌గన్‌ అయి ఉంటుందని, స్నిపర్‌గన్‌ కూడా అయి ఉండవచ్చని పార్టీసీనియర్లు ఆందోళన వ్యక్తంచేసారు. అంతేకాకుండా పార్టీ ఇందుకు సంబంధించిన వీడియోక్లిప్‌ను కూడా విడుదలచేసింది. హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు ఆక్లిప్‌నుసైతం పంపించింది. ఈ లేఖపై అహ్మద్‌పటేల్‌, జైఊరామ్‌రమేష్‌, రణదీప్‌ సింగ్‌సూర్జేవాలాలు సంతకాలుచేసారు. ఇందుకు సంబంధించి మాజీ రక్షణసిబ్బందిని సైతం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక సాక్ష్యాధారాలు రప్పించేందుకు ఈ లేజర్‌ కిరణాలు ఒకఅత్యాధునిక ఆయుధం నుంచి వచ్చినవి అయి ఉంటాయని, బహుశా స్నిపర్‌ గన్‌ వంటిది అయి ఉంటుందని వెల్లడించారు.దీన్నిబట్టిచూస్తే కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షునికి ఇచ్చిన రక్షణపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నదని, సెక్యూరిటీనిసైతం ఉల్లంఘించి సిన్నపర్‌గన్‌ వచ్చిందంటే ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొన్నారు. హంతకులు రాహుల్‌గాంధీపై గురిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అయ్యాయన్నారు. అంతేకాకుండా రాహుల్‌ తండ్రి, నాయనమ్మనుసైతం జాతివ్యతిరేకులు హత్యచేసారని, అదేతరహాలో ఇపుడు రాహుల్‌కుసైతం ప్రమాదం పొంచి ఉందని నాయకులు పేర్కొన్నారు. ముందు రాహుల్‌కు ఇచ్చిన సెక్యూరిటీని సమీక్షించాలని కోరారు. ఇలాంటిఅనూహ్య సెక్యూరిటీ ప్రమాదాన్ని ముందుగానే గమనించి అరికట్టాలని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలనికోరారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/