రెండో విడత పోలింగ్‌లో ఓటేసిన ప్రముఖులు

kiran bedi, kamal haasan shruti haasan, palani swamy
kiran bedi, kamal haasan shruti haasan, palani swamy

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రారంభమైన రెండవ విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరగుతుంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజనీకాంత్‌ చెన్నై సెంట్రల్‌ నియోజకవర్గంలోని స్టెల్లా మేరి కాలేజిలో, సినీనటుడు ,మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, ఆయన కుమార్తె శ్రుతి హాసన్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేటలో ఓటు వేశారు. సినీ నటులు అజిత్‌, ఆయన భార్య షాలిని, విజ§్‌ు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు సియం పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో ఓటు వేశారు. పుదుచ్చేరి లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి , సినీనటుడు, బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరు సౌత్‌ నియోజకవర్గంలో ఓటేశారు. చిదంబరం, కార్తి చిదంబరం కూడా సతీమణితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో సోలాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/