తూత్తుకుడి బరిలో రాజకీయ నేతల కూతుళ్లు

Kanimozhi, Tamilisai
Kanimozhi, Tamilisai


చెన్నై: తమిళనాడులో తూత్తుకుడి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఆ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత కుమారి అనంతన్‌ కూతురు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందర్యరాజన్‌ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి డిఎంకే తరఫున కరుణానిధి కూతురు, రాజ్యసభ ఎంపి కనిమొళి కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ రాజకీయ నేతల కూతుళ్లు కావడం విశేషం. మొత్తం 37 మంది అభ్యర్ధులు తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ 14.25 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఆ నియోజకవర్గంలో ఉన్న స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళన చోటుచేసుకుంది. ఐతే అక్కడున్న కార్మికులు డిఎంకేకి మొగ్గు చూపుతారా లేక బిజెపికి ఓటు వేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/