కమల్‌పై పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

kamal haasan
kamal haasan

న్యూఢిల్లీ: మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కమల్‌ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఫోరమ్‌లోనే దీనిపై సంప్రదించవచ్చని పిటిషనర్‌ బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. అదే విధంగా పిటిషనర్‌ వేసిన పిటిషన్‌ను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.
హిందూమతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్‌చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఉపాధ్యాయ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని మంగళవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/