మోడీ మళ్లీ ప్రధాని కావడం కష్టమే

naveen patnaik
naveen patnaik, odisha cm


ఒడిశా: ఒడిశా సిఎం నవీన పట్నాయక్‌ మోడిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మళ్లీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకు లేదన్నారు. ఓ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రధాని వాజ్‌పే§్‌ుతో తాను పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్ధ ప్రధాని అని కొనియాడారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకైతే లేదన్నారు. వాజ్‌పే§్‌ుతో మోడీని పోల్చలేమన్నారు పట్నాయక్‌. మోడీ చెప్పింది ఏదీ చేయలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంకా పరిపక్వత రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మోజార్జీ రాని పక్షంలో ఒడిశాను ఆదుకునే వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన బిజెపికి సవాలు విసిరారు. రాష్ట్రానికి సిఎం అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బిజెపి తమ అభ్యర్తిని ప్రకటించేందుకు భయపడుతుందన్నారు. బిజెపి నేతలు చెప్పే డబుల్‌ ఇంజన నినాదం ఒడిశాలో ఫెయిల్‌ అయ్యిందన్నారు పట్నాయక్‌.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/