యుపి సియంకు ఈసి నోటీసులు

 Yogi Adityanath
Yogi Adityanath


న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగసభలో భారత సైన్యాన్ని మోది సేన గా అభివర్ణిస్తూ యుపి సియం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై ఈసి తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై గజియాబాద్‌ కలెక్టర్‌ మంగళవారం ఈసికి వాస్తవిక నివేదికను అందజేశారు. నివేదిక ఆధారంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఈసి దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ యోగికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సైనికుల ప్రస్తావన తీసుకురావద్దన్న మార్గదర్శకాలను ఆదిత్యనాథ్‌ ఉల్లంఘించారని ఈసి అభిప్రాయపడినట్లు సమాచారం.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/