6న కన్నౌజ్‌లో అఖిలేష్‌ సతీమణి నామినేషన్‌

dimple yadav
dimple yadav


లక్నో: సమాజ్‌వాదిపార్టీ అధినేత ఉత్తరప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ తన సిట్టింగ్‌ స్థానం కన్నౌజ్‌నుంచే పోటీచేస్తున్నారు. ఆమె తన నామినేషన్‌ పత్రాలను 6వ తేదీ దాఖలుచేయనున్నారు. 2012లో కన్నౌజ్‌నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ఆమె భర్త అఖిలేష్‌ యాదవ్‌ ఆజాంఘర్‌ నియోజకవర్గంనుంచి పోటీచేస్తున్నారు. ఆమె మామ ములాయంసింగ్‌ యాదవ్‌ మైన్‌పురి నియోజకవర్గం, ఆమె మరిగి అక్ష§్‌ుయాదవ్‌ ఫిరోజాబాద్‌లనుంచి పోటీచేస్తున్నారు. సమాజ్‌వాదిపార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుస్థానాలను గెలుచుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్‌సమాజ్‌పార్టీ, ఆర్‌ఎల్‌డితో పొత్తులు ఏర్పాటుచేసుకుని పోటీకి దిగింది. యుపిలో ఏడుదశల్లోను పోలింగ్‌ జరుగుతుంది. ఈనెల 11నుంచి మే 19వ తేదీవరకూ పోలింగ్‌జరుగుతుంది. ఓట్లలెక్కింపు దేశవ్యాప్తంగా మే 23న జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజా నటీ నటుల ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/