అద్వాని, జోషిల ఆశీర్వాదం తీసుకున్న మోది

modi, l k advani, joshi
modi, l k advani, joshi


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బిజెపి అధినేత మోది సీనియర్‌ నేతల ఆశీర్వాదం తీసుకున్నారు. బిజెపి కురు వృద్ధుడు ఎల్‌ కె అద్వాని, బిజెపి సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషిని మోది మర్యాద పూర్వకంగా వారి నివాసాలకు వెళ్లి కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ ఉదయం అద్వాని ఇంటికి మోదితో పాటు అమిత్‌ షా కూడా వెళ్లారు. ఆయనతో బిజెపి విజయాన్ని పంచుకున్నారు. పార్టీ తదుపరి కార్యాచరణ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం.
ఆ తర్వాత మురళీ మనోహర్‌ జోషి నివాసానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలను మోది తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. అద్వానీ లాంటి గొప్ప నేతలు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడం వల్లే నేడు బిజెపి ఈ విజయాన్ని సాధించగలిగింది అని మోది పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌లో మురళీ మనోహర్‌ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యా విధానాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. బిజెపి బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/