ఢిల్లీ నుంచి 6గురు అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్‌

Sheila Dikshit
Sheila Dikshit

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఆరింటికి అభ్యర్ధులను ప్రకటించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు విషయమై ఇంతకాలం వేచిచూసిన ఆ పార్టీ చివరకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. సీనియర్‌ నేత, ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా, మరో కీలక నేత అజ§్‌ు మాకెన్‌ న్యూఢిల్లీనుంచి బరిలోకి దిగుతున్నారు. తొలుత ఢిల్లీ తూర్పు నుంచి షీలా దీక్షిత్‌ బరిలోకి దిగుతారని భావించినా..అక్కడి నుంచి అర్విందర్‌ సింగ్‌ను పోటీలో నిలిపారు. అలాగే చాంద్‌నీ చౌక్‌ నుంచి జేపి అగర్వాల్‌, నార్త్‌ వెస్ట్‌ నుంచి రాజేశ్‌ లిలోతియా, ఢిల్లీ పశ్చిమం నుంచి మాహాబల్‌ మిశ్రా పోటీ చేస్తున్నారు. మరో స్థానం ఢిల్లీ దక్షిణం అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/