ఈవిఎంలలో కాంగ్రెస్‌ బటన్‌ పనిచేయడం లేదు

polling in poonch
polling in poonch


జమ్మూ: జమ్ము కాశ్మీర్‌లోని ఫూంచ్‌లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ ద్వారా పేర్కోన్నారు. రాష్ట్రంలోని కనీసం ఆరు ఓటింగ్‌ బూత్‌లలో ఇలాంటి పరిస్థితులున్నాయని ఆయన అన్నారు. ఈవిఎంలలో కాంగ్రెస్‌ బటన్‌ పనిచేయడంలేదని ఆయన ఆరొపించారు. దీంతో పోలింగ్‌ బూత్‌లలో ఓటింగ్‌ ఆలస్యమవుతుందని స్థానికులు ఆందోళన చేయడంతో ఈవిఎంలను మారుస్తామని పోలింగ్‌ ఆఫీసర్‌ చెప్పి వారిని శాంతింపజేశారు. సిబ్బంది కొరతగా ఉందని, బ్యాలెట్‌ యూనిట్‌లో చేతి గుర్తు బటన్‌ పనిచేయడంలేదని అధికారి చెప్పారు.
మరో పోలింగ్‌ కేంద్రంలో బిజెపి బటన్‌ పనిచేయడం లేదని ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/