ఈసి నుంచి రెవెన్యూ సెక్రటరికి, సిబిడిటి ఛైర్మన్‌కు పిలుపు

election commission
election commission

ముంబై: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై మాట్లాడేందుకు సిబిడిటి ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారు నేడు ఈసిని కలవటానికి వెళ్లనున్నారు. ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడులపై కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బిజెపి వివిధ శాఖలను దుర్వినియోగం చేస్తుందని మండిపడింది. ఇప్పటికే ఈసి ఆర్థిక శాఖకు సూచనలు జారీ చేశారు. ఆ శాఖకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు దాడులు ఏవైనా నిష్పాక్షికంగా చేయాలని, వేధింపులు వద్దని సూచించింది.
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఐటి శాఖ పలువురు నేతలపై దాడులను నిర్వహించింది. లెక్కలు చూపని రూ.281 కోట్లను సోమవారం ఆదాయపుపన్ను శాఖ స్వాధీనం చేసుకుంది.

తాజా హీరోల ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/