లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలు

 Naveen Patnaik
Naveen Patnaik, bjd chief


హైదరాబాద్‌: బీజూ జనతాదళ్‌(బిజెడి)కి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు..ఈసారి లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఒడిశా సియం, నవీన్‌పట్నాయక్‌ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు ప్రసన్న ఆచార్యకు ఇప్పుడు బార్‌ఘడ్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. కందమాల్‌ ఎంపి స్థానం నుంచి అచ్యుత్‌ సమంత పోటీ చేస్తారు. రాజ్యసభ ఎంపిగా ఫిల్మ్‌స్టార్‌ అనుభవ్‌ మోహంతి ఇప్పుడు కేంద్రపారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారు. బిజెపి ఎంపి బైజయంతి పాండాపై ఆయనపోటీ చేయనున్నారు. రాజ్యసభ ఎంపిగా ఉన్న ప్రతాప్‌ కేసరి దేవ్‌, ఈసారి అవుల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/telangana-election-candidates-list/