కిరణ్‌ఖేర్‌కు మద్దతుగా భర్త అనుపమ్‌ ఖేర్‌ ప్రచారం

kirron kher, anupam kher
kirron kher, anupam kher

చండీఘడ్‌: తన సతీమణికి మద్దతుగా భర్త అనుపమ్‌ ఖేర్‌ గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ సతీమణి కిరణ్‌ ఖేర్‌ తరఫున అనుపమ్‌ ఖేర్‌ ప్రచారం చేశారు. కిరణ్‌ ఖేర్‌ బిజెపి అభ్యర్థిగా చండీఘడ్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం ఉదయం మనిమజ్రా ప్రాంతంలోని శివాలిక్‌ పార్కులో అనుపమ్‌ ఖేర్‌ ఓట్లు అభ్యర్ధించారు. ఎన్నికల్లో తన భార్య కిరణ్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. పార్కులో పలువురు సందర్శకులతో కలిసి అనుపమ్‌ ఖేర్‌ సెల్ఫీలు దిగారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/