ఓటేసిన అన్నాహజారే…మోడీ తల్లి హీరాబెన్‌…

anna hajare, heeraben
anna hajare, heeraben


ముంబయి: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్‌పాల్‌ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్‌సిద్దిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ సరళిపట్ల స్పందించడానికి నిరాకరించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాచారాన్ని దాటవేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలేవీ మాట్లాడట్లేదని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. 98ఏళ్ల వయసులో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అహ్మదాబాద్‌లోని రైసన్‌ ప్రాంతంలో ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా హీరాబెన్‌ వెంట…ఆమె బంధువులు, భద్రతాధికారులు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే…అక్కడి సిబ్బంది హీరాబెన్‌కు చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. అంతకుముందు ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/