అమేథిలో రాహుల్‌ నామినేషన్‌పై అభ్యంతరాలు

amethi EC officer
amethi EC officer

లక్నొ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథిలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాహుల్‌ నామినేషన్‌ పత్రాల తనిఖీని ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. బ్రిటన్‌లో రిజిస్టరు ఐన కంపెనీ ప్రకారం రాహుల్‌కు ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తున్నదని, అంటే ఈ దేశంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పౌరుడు కాదు అని, అందుకే ఆయన ఎన్నికలకు అనర్హుడు అంటూ న్యాయవాది రవిప్రకాశ్‌ ఆరోపించారు. రాహుల్‌ సమర్పించిన విద్యార్హత పత్రాల్లోనూ అనేక తప్పులున్నాయని ,ఒరిజినల్‌ విద్యా పత్రాలను సమర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/