యోగి 3 రోజులు, మాయావతి 2 రోజులు ప్రచారంపై నిషేధం

mayawati, yogi adithya nath
mayawati, yogi adithya nath


న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ సియం యోగి ఆదిత్యనాథ్‌ ,బిఎస్‌పి అధినేత్రి మాయావతి వీరు మత పరమైన వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ఎన్నికల కమీషన్‌ తప్పుపట్టింది. అందుకే వీరిపై నిషేధం విధించింది. ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటలు నిషేధం విధించింది. ఆ ప్రకారం యోగి మూడు రోజులు, మాయావతి 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.
మీకు అలీ ఉంటే మాకు బజరంగబలి ఉన్నారు అంటూ యోగి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది హిందూ, ముస్లింల మధ్య వైరానికి దారి తీస్తుందంటూ ఈసికి ఫిర్యాదులు వెళ్లాయి. మాయావతి మత ప్రాతిపదికపైనే బిజెపి టికెట్లు ఇస్తుందన్నారు. అందుకే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసి వీరిపై చర్యలకు దిగింది. ఐతే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేతలపై ఈసి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. షెడ్యూల్‌ ప్రకారం మాయావతి మంగళవారం నాడు లక్నోలో ప్రచారం చేయాల్సి ఉంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/