బిజెపిలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, తృణమూల్‌కు దెబ్బ

MLA's joined in bjp
MLA’s joined in bjp

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్‌కు చెందిన ఇద్దరు, సిపిఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే వీరితో పాటు మొత్తం 50 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు నేడు బిజెపిలో చేరారు. వీరిలో తృణమూల్‌ బహిష్కృత నేత సుబ్రగన్షు రా§్‌ు, తుషార్కుటి భట్టాచార్య, సిపిఎంకు చెందిన దెబెంద్రానాథ్‌ రా§్‌ు ఉన్నారు. ఈ చేరికలు భవిష్యత్‌లో ఇంకా కొనసాగనున్నట్లు బిజెపి నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ కైలాశ్‌ తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లకుగాను బిజెపి 18 స్థానాల్లో గెలుపొందింది. 2021లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/