నేడు వరంగల్‌, భువనగిరిలో సిఎం సభలు

ts cm kcr
ts cm kcr

వరంగల్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం వరంగల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానంలో, భువనగిరి పట్టణంలోని నీలగిరి టాకీస్ పక్కన మైదానంలో నిర్వహించే భారీ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. సభల కోసం ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ జనసమీకరణే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. వరంగల్ సభకు రెండున్నర లక్షలమంది తరలివస్తారనే అంచనాతో 50 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాట్లుచేస్తున్నారు. భువనగిరి పట్టణంలోని నీలగిరి టాకీస్ పక్కన మైదానంలో 16 ఎకరాల స్థలాన్ని బహిరంగ సభ కోసం సిద్ధంచేశారు. సాయంత్రం 5.30 గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరయి ప్రసంగించనున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు లక్షలకుపైగా జనం వస్తారనే అంచనాతో వేదికను తీర్చిదిద్దారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/