ప్రభుత్వ ఉన్నతాధికారులతో జోషి సమీక్ష

sk joshi, ts cs
sk joshi, ts cs


హైదరాబాద్‌: పురపాలక, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్లు, వేడుకలు, సమావేశాలు నిర్వహణకు నిబంధనలు, అనుమతులపై సిఎస్‌ భేటిలో చర్చించారు. అదేవిధంగా వివిధ శాఖల అనుమతులకు సంబంధించి ముసాయిదా నిబంధనలపై చర్చించారు. నిర్వహణ విధానాలపై సలహాలు, వివరాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు. నిబంధనలపై నిర్వాహకులు స్వీయ ధృవీకరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/